Coolie works in umbrella shade: భానుడి తాపానికి పచ్చని భూములు సైతం మలమలా మాడిపోయి... బీటలు వారుతున్నాయి. ఇంతటి వేడిలో పనులు చేయడానికి కూలీలు జంకుతున్నారు. పంట పొలాల్లో పని చేసేందుకు కూలీలు ఎవరూ రావడం లేదు. దీంతో వైయస్‌ఆర్ జిల్లా లింగాల, సింహాద్రిపురం మండలాలకు చెందిన చీనీ, నిమ్మ రైతులు ఓ ఆలోచన చేశారు. రైతులు పనిచేసే ప్రదేశంలో కూలీల కోసం గొడుగులు ఏర్పాటు చేశారు. ఈ గొడుగుల నీడలో రైతులు ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందుతూ పనులు చేసుకుంటున్నారు.
అదిరేటి ఐడియా.. గొడుగు నీడలో కూలి పనులు - వైయస్‌ఆర్ జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
works in umbrella shade: మండుతున్న ఎండల్లో పనులు చేసేందుకు ఎవరూ ఇష్టపడతారు. ఎంత అవసరం ఉన్నా.. ఎండలో పని చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని కూలీలు సైతం ముందుకు రావడం లేదు. అందుకే వైయస్‌ఆర్ జిల్లాలో కొందరు రైతులు వినూత్నంగా ఆలోచించారు. కూలీలకు ఎండవేడి నుంచి ఉపశమనం కోసం గొడుగులు ఏర్పాటు చేశారు.

గొడుగు నీడలో కూలీ పనులు
Last Updated : Apr 13, 2022, 10:11 AM IST