కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు ఎమ్యెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి భూమి చేయడాన్ని నిరసిస్తూ భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. దీన్ని భాజపా పూర్తిగా వ్యతిరేకిస్తోందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. వేల మందిని ఊచకోతకోసిన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడం బాధాకరమన్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చెయ్యడం వెనుక కుట్రదాగి ఉందన్నారు. ఓట్ల కోసమే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారన్న ఆయన.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కూడా సుల్తాన్‌గా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. విగ్రహా ఏర్పాటుపై ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డితో పాటు మఖ్యమంత్రి వివరణ ఇవ్వాలన్నారు.
వినతి పత్రం అందజేత..
టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వద్దని.. జిల్లా నాయకులతో కలిసి పట్టణ కమిషనర్ రాధకు వినతిపత్రం అందజేశారు. అనంతరం పురపాలక కార్యాలయం నుంచి టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేసిన ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్తుండగా విష్ణువర్ధన్‌రెడ్డితో పాటు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
'భారత ప్రభుత్వ రాజ్యాంగం అమలు కావడం లేదు'