కడప జిల్లాలోని ఏపీలవంకపల్లి గ్రామంలో బ్యానర్ల ఏర్పాటుపై... అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. వైకాపా నేతల ఫొటోలతో కొందరు వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని మరో వర్గం ఆదివారం రాత్రి వాటిని చించేసి.. చెప్పులు కట్టారు. ఈ విషయంపై ఆగ్రహించిన వేరే వర్గం నాయకులు... రాయచోటి-కదిరి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో గంటన్నర పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
బ్యానర్ల ఏర్పాటుపై అధికార పార్టీ వర్గాల వివాదం..రోడ్డుపై బైఠాయింపు - కడపలో బ్యానర్ ల వివాదం
బ్యానర్ల ఏర్పాటు విషయంలో ఒకే పార్టీకి చెందిన వారి మధ్య వివాదం మెుదలై.. చివరకు రహదారిపై నిరసన చేసే పరిస్థితికి వచ్చింది. ఈ ఘటన కడప జిల్లాలోని రాయచోటి మండలంలో జరిగింది.
బ్యానర్ ల ఏర్పాటుపై ఒకే పార్టీలో వివాదం
ఈ విషయం తెలుసుకున్న రాయచోటి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఫ్లెక్సీలో తమ ఫొటోలు లేవన్న ఆగ్రహంతోనే అదే పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఈ పని చేసి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:తాడిపత్రిలో జేసీ సోదరుల గృహనిర్బంధం