ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామస్థుల వద్ద రూ.10 కోట్లు అప్పు చేసి పరారైన కాంట్రాక్టర్ - ఉప్పలపాడులో అప్పు చేసి పారిపోయిన కాంట్రాక్టర్ వార్తలు

వాళ్లంతా రైతులు.. వడ్డీ వస్తుందన్న ఆశతో సొమ్మును గుత్తేదారుడికి వడ్డీకి ఇచ్చారు. డబ్బు తీసుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు గ్రామంలో కనిపించడం లేదు. ఫోన్ కలవడంలేదు. ఈ క్రమంలో కంగారుపడిన రైతులు పోలీసులను ఆశ్రయించారు. కాంట్రాక్టర్ అని, శనగల వ్యాపారమూ చేస్తుంటాడని, డబ్బులు పక్కాగా తిరగిచ్చేస్తాడనే నమ్మకంతో ఇస్తే ఇలా కనిపించకుండా పోయాడని వాపోయారు. తమ సొమ్ము తమకందేలా చేయాలని వేడుకున్నారు.

contractor escape with villagers money in uppalapadu kadapa district
పోలీసులను ఆశ్రయించిన బాధితులు

By

Published : Jul 10, 2020, 11:56 AM IST

కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఉప్పలపాడుకు చెందిన ఓ గుత్తేదారుడు గ్రామస్థుల వద్ద సుమారు రూ.10 కోట్లు అప్పు చేసి పరారయ్యాడు. గత 10 రోజులుగా కాంట్రాక్టర్ ఊర్లో కనిపించడం లేదంటూ గ్రామస్థులు పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ కూడా కలవడం లేదని డీఎస్పీ నాగరాజుకు వివరించారు.

కాంట్రాక్టర్​ శనగల వ్యాపారం సైతం చేస్తుంటాడని.. గ్రామస్థులు తెలిపారు. సక్రమంగా అప్పు చెల్లిస్తాడనే నమ్మకంతో అతనికి డబ్బిచ్చామని.. ప్రామిసరీ నోట్లు సైతం రాయించుకున్నామని పేర్కొన్నారు. బిల్లులు పెండింగ్​లో ఉన్నాయని.. అవి రాగానే అప్పు తీర్చేస్తానంటూ కాంట్రాక్టర్​ ఇన్నాళ్లూ తమను మభ్య పెట్టాడని వాపోయారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details