ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కమీషన్ల కోసమే అలా చేశారు.. అధికారులపై కాంట్రాక్టర్​ ఆరోపణలు - కంట్రాక్టర్​ ఒప్పంద వార్తలు

Contractor Allegations : వైఎస్సార్​ జిల్లాలో ఇద్దరూ అధికారులకు, గుత్తెదారుడికి మధ్య జరిగిన ఒప్పందం బెడిసికొట్టింది. గుత్తెదారుడు ఒప్పదం గురించి తెలపటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మొదట తనతో ఒప్పందం కుదుర్చుకున్న పనిలో.. తన స్థానంలో వేరే వ్యక్తితో పనులు చేపట్టారని గుత్తేదారుడు తెలిపాడు.

Contractor Allegations
బెడిసి కొట్టిన ఒప్పందం

By

Published : Dec 15, 2022, 7:53 PM IST

Contractor Allegations: వైఎస్సార్​ జిల్లాలో జువారి సిమెంట్​ పరిశ్రమకు చెందిన భూముల నుంచి వెళ్తున్న విద్యుత్​ లైన్ల మార్పిడికి 2.5 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేశారు. టవర్ల నిర్మాణం చేపట్టాడానికి ఎస్పీడీసీఎల్​ డీఈ శ్రీనివాస రెడ్డి, ఏడీఈ నరసింహారెడ్డి తనను పిలిచారని కాంట్రాక్టర్​ సురేష్​కుమార్​ రెడ్డి తెలిపాడు. ఈ పనులు పూర్తి చేస్తే.. కోటి రూపాయల ఆదాయం వస్తుందని.. డీఈకి రూ.35లక్షలు, ఏడీఈకి రూ.35 లక్షలు, తనకు రూ.35 లక్షల కింద వాటాలు నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తన దగ్గర నుంచి అన్నిరకాల సమాచారం,.. సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుని.. తన వాటాను వారే దక్కించుకునేందుకు చూస్తున్నారని గుత్తేదారుడు ఆరోపించాడు.

తన స్థానంలో ఓ రియల్​ ఎస్టేట్​ వ్యాపారిని బినామీగా పెట్టుకుని.. పనులు చేపడుతున్నట్లు తెలిపాడు. చేపట్టిన పనుల్లో కూడా నాణ్యత లోపం ఉందని ఆరోపించాడు. గుత్తేదారుడి ఆరోపణలపై స్పందించిన డీఈ.. గుత్తేదారుల ఎంపిక విషయంలో జువారి కంపెనీ పాత్ర మాత్రమే ఉందని,.. తమ ప్రమేయం లేదని తెలిపారు. కేవలం పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details