కడప జిల్లా రాజంపేటలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి భవన నిర్మాణ కార్మికులు నిరసన చేశారు. రాష్ట్రంలో ఇసుక లేక కొన్ని నెలలు.. కరోనాతో మరో కొన్ని నెలలు కార్మికులు పనులు లేక ఇబ్బంది పడ్డారని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య తెలిపారు. కుటుంబ పోషణ భారమై వీధిన పడే పరిస్థితి వచ్చిందన్నారు.
ఇలాంటి సమయంలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతి కార్మిక కుటుంబానికి పదివేల రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క కార్మికుడికి ఎంత ఇస్తారో చెప్పకుండా కార్మిక శాఖ అధికారులు పత్రాలు, ఫోటోలు సేకరించి నెల రోజులు అవుతున్నా... అధికారులు సమాధానం చెప్పడం లేదన్నారు.