జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను.. పోలీసులు కాపాడిన ఘటన గురువారం కడప జిల్లా మైలవరంలో జరిగింది. ప్రొద్దుటూరులో ఈశ్వర్ రెడ్డి నగర్‌కు చెందిన ఉమ్మడి రత్నమ్మ (42) మైలవరం జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ రామయ్య గమనించి సమయస్ఫూర్తితో ఆమెను కాపాడారు. పక్కనే ఉన్న జాలర్ల సహాయంతో ఆమె నీళ్లలోకి దూకకుండా రక్షించారు.
జలాశయంలోకి దూకేందుకు మహిళ యత్నం.. కాపాడిన కానిస్టేబుల్ - మైలవరం వార్తలు
మైలవరం జలాశయంలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కానిస్టేబుల్ రక్షించాడు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. సమయస్ఫూర్తితో మహిళను కాపాడిన కానిస్టేబుల్‌ను ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందించారు.
women try to suicide
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి.. అందరికీ కౌన్సిలింగ్ చేశామని ఎస్సై రామకృష్ణ తెలిపారు. సమయస్ఫూర్తితో మహిళను కాపాడిన కానిస్టేబుల్ రామయ్యను ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందించినట్లు ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి:చిట్టీల పేరుతో దగా.. కోట్ల రూపాయలతో ఉడాయింపు