కడప జిల్లా రాజంపేటకు చెందిన ఉపాధ్యాయుడు అరవ మోహన్రావు కరోనా పాటతో ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నారు. రాజంపేట మండలం ఇండ్లూరి వారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఈయన ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా సోకకండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాట రూపంలో పాడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
కరోనాపై గేయం.. ప్రజల్లో చైతన్యమే ధ్యేయం.. - కడప జిల్లా నేటి వార్తలు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజల్లో చైతన్యం తేవడానికి ఎంతోమంది గాయకులు తమ వంతు కృషి చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తన పాటతో కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాటతో అవగాహన కల్పించారు.
కొవిడ్ నివారణ ఏర్పాట్లపై మాట్లాడుతున్న రాజంపేట మాజీ ఎమ్మెల్యే