సీఎం జగన్మోహన్ రెడ్డి పై కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. జగన్.. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించి.. ఇప్పుడు సీఎం అయ్యాక వ్యతిరేకించడం ఏంటన్నారు. అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తామని ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే 151 కాదు కదా 25 సీట్లు కూడా వచ్చేవి కాదని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది అనిపిస్తే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలవవాలని సవాల్ చేశారు.
'జగన్ ఆ విషయం చెప్పుంటే... ఒక్క సీటూ వచ్చేది కాదు' - congress working president comments
రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తులసిరెడ్డి.. రాజధాని అంశంపై మాట్లాడారు. రాజధానిని మారుస్తామని ఎన్నికలకు ముందే జగన్ చెప్పిఉంటే.. వైకాపాకు అధికారం వచ్చి ఉండేది కాదన్నారు.

నర్రెడ్డి తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
నర్రెడ్డి తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఇవీ చదవండి: