అమ్మలాంటి తెలుగు భాషను హత్య చేసిన ముఖ్యమంత్రి జగన్.. అమ్మఒడి స్థానంలో మమ్మీఒడి అని పిలవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసీరెడ్డి మండిపడ్డారు. కడప జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఆయన... పిల్లలకు మామయ్యను చెల్లెళ్లకు అన్న అవుతానన్న జగన్...శకుని, కంసుని పాత్రలు పోషించవద్దని ఎద్దేవా చేశారు. వివిధ సంక్షేమ శాఖలకు కేటాయించిన నిధులన్నింటిని అమ్మఒడికి కేటాయించారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి ఆంగ్లంపై ఇష్టముంటే ఆయన దినపత్రికను, ఆయన ఛానల్ను ముందు ఆంగ్లంలోకి మార్చు కోవాలని సవాల్ విసిరారు. అమ్మ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు సీఎంకు గాని వారి అనుచరులకు గాని లేదని ఆయన స్పష్టం చేశారు.
'సంక్షేమ శాఖలకు కేటాయించిన నిధులు అమ్మఒడికి మళ్లించారు' - సీఎం జగన్పై మండిపడ్డ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
ముఖ్యమంత్రి జగన్పై కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కడప జిల్లాలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. సీఎం సంక్షేమ శాఖలకు కేటాయించిన నిధులు అమ్మఒడికి మళ్లించారని ఆరోపించారు.

సీఎం జగన్పై మండిపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి