ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతాం: కాంగ్రెస్ - కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ వార్తలు

పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతామని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్​ ఆశాభావం వ్యక్తం చేశారు. కడపలో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్​కు చిత్తశుద్ధి ఉంటే ఏకగ్రీవాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు.

Congress party state president Shailajanath
పంచాయతీ ఎన్నికల్లో సత్తా

By

Published : Jan 27, 2021, 3:48 PM IST

రెండేళ్లలోనే వైకాపా ప్రజల విశ్వాసం కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్​కు చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగిన ఏకగ్రీవాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరిగినా పూర్తి బాధ్యత రమేష్ కుమార్​దేనని తెలిపారు.

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం..

రెండేళ్ల పాలనలో వైకాపా చేసిందిమీ లేదని.. కేవలం ప్రారంభోత్సవాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్కటి కూడా అమలు చేయలేదని శైలజానాథ్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపుతామని ఆయన ఆశాభావ వ్యక్తం చేశారు. వైకాపా, జనసేన పార్టీలు భాజపా తొత్తులుగా మారాయని విమర్శించారు. విద్యుత్ మోటార్​లకు మీటర్లు బిగిస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:మామిడి రైతును కలవరపెడుతున్న వాతావరణం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details