ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడుతో ఆటోను లాగుతూ.. కాంగ్రెస్ నేతల నిరసన - కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వార్తలు

పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంపునకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కడప జిల్లా వేంపల్లిలో ఆటోకు తాడుకట్టి లాగుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి వినూత్నంగా నిరసన చేపట్టారు.

Congress party leaders protest
వినూత్నంగా కాంగ్రెస్ నేతలు నిరసన

By

Published : May 30, 2021, 11:38 AM IST

కేంద్రంలో భాజపా, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాలు వడ్డింపులు, వాయింపుల ప్రభుత్వాలుగా తయారయ్యాయని కాంగ్రెస్ నాయకులు తులసి రెడ్డి విమర్శించారు. వేంపల్లిలో ఆటోకు తాడుకట్టి లాగుతూ.. నిరసన చేపట్టారు. కేంద్రం పెంచిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతుంటే.. వంట గ్యాస్ ధర పదో సెంచరీకి సమీపంలో ఉందన్నారు. జగన్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై విధించిన అదనపు వ్యాట్ ను తగ్గించాలని వారు కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details