Tulasi Reddy fire on cm Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా ఛైర్మన్ నరెడ్డి తులసి రెడ్డిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయని.. ఈ నాలుగేళ్ల పాలనలో జగన్ రెడ్డి.. అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమాన్ని సంక్షోభంలో నెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ నాలుగేళ్ల పాలనలో అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్: తులసి రెడ్డి దేశంలోనే ఇంతటి ఫెయిల్యూర్ సీఎం లేడు : టీడీపీ నేత యనమల
అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్..కడప జిల్లా వేంపల్లిలో తులసి రెడ్డి ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజుతో నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ నాలుగేళ్ల పాలనను ఒక్క ముక్కలో చెప్పాలంటే.. 'ఇది రాక్షస పాలన లేదా చీకటి పాలన'.. అదే మూడు ముక్కల్లో చెప్పాలంటే.. 'అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం సంక్షోభంలో' అని చెప్పొచ్చు. రాష్ట్రం అప్పుల కుప్పైపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేసిన అప్పు.. రూ.10కోట్ల రూపాయలు. అందులో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు.. ఏడున్నర లక్షల కోట్లు. మనకంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అప్పు రూ.6లక్షల కోట్ల రూపాయలు. ఇది సీఎం జగన్ రెడ్డి పాలన'' అని ఆయన అన్నారు.
మరోసారి అధికారం ఇస్తే రెండేళ్లలో ప్రభుత్వ బడులు కార్పోరేట్ బడులతో పోటీ పడేలా చేస్తా
ఏపీ అప్పు రూ.7.5 లక్షల కోట్లు.. అనంతరం 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలలో నీలం సంజీవరెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి వరకు 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చేసిన అప్పు లక్ష కోట్ల రూపాయలు అయితే, 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు రూ.1.5 లక్షల కోట్లు అని నరెడ్డి తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 2019 నుంచి నేటివరకూ (2023) కేవలం 4 సంవత్సరాల కాలంలోనే జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 7.5 లక్షల కోట్లు అని వివరాలను వెల్లడించారు. వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ, సాగునీటి రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతుల, కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని గుర్తు చేశారు.
ఈ పథకాలు నాన్న బుడ్డికి చాలటం లేదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపై తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి పథకాలు నాన్న బుడ్డికి చాలటం లేదని వ్యాఖ్యానించారు. బాదుడే బాదుడు అనే కార్యక్రమం పేరుతో పన్నులు, ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, మద్యం, ఇసుక వంటి ధరలను విపరీతంగా పెంచి ప్రజల నుంచి వేలల్లో వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం మాఫియా రాజ్యంగా తయారైందని తులసి రెడ్డి ఆవేదన చెందారు. నాలుగేళ్ల కిందట 'రావాలి జగన్, కావాలి జగన్' అన్న ప్రజలే నేడు 'పోవాలి జగన్, వద్దు జగన్' అని అంటున్నారని ఆయన గుర్తు చేశారు.
Tulasi Reddy on Govt Advisers: 'ప్రభుత్వ సలహాదారులు కాదు.. సొమ్ము స్వాహాదారులు'