కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు పార్టీ పరిశీలకులు లక్ష్మీనారాయణతో కలిసి ఆయన కడప జిల్లా ఇందిరాభవన్లో సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో భాజపాతో పాటు వైకాపా, తెదేపా, జనసేన పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే నినాదంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. వివేకానందరెడ్డి దారుణహత్యకు గురై ఏడాది కావస్తున్నా... కేసును చేధించలేదంటే ఏమనుకోవాలని వ్యాఖ్యానించారు. జగన్పై నమ్మకం లేక తన చిన్నమ్మ, చెల్లెలు సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ వేశారని... ఇలాంటి ముఖ్యమంత్రి 5 కోట్ల మంది ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని తులసిరెడ్డి ప్రశ్నించారు.
'ఎన్నికల్లో పోటీ చేయటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది' - tulasireddy latest press meet news
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో భాజపాతో పాటుగా వైకాపా, తెదేపా, జనసేన పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు. తన సొంత చిన్నమ్మ, చెల్లెలకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు.
కడపలో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రెస్మీట్