ఆంగ్లభాషపై సీఎం జగన్‌కు అంత వ్యామోహం ఉంటే... తన సాక్షి దినపత్రిక, ఛానళ్లను ఆంగ్లానికి మార్చాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆంగ్ల మాధ్యమ బోధనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... ఒక చారిత్రక తప్పిదమని అన్నారు. ప్రతిపక్షనేతగా 2016 లో జగన్ చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతనే లేదని ఆయన కడపలో మండిపడ్డారు.
'ఆంగ్ల మాధ్యమం'... చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి - ఏపీలో ఆంగ్ల విధానం అమలు వార్తలు
ఆంగ్ల మాధ్యమ బోధనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... ఒక చారిత్రక తప్పిదమని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు.
congress-leader-tulsireddy-fire-on-cm-jagan-over-english-medium-policy-in-govt-schools