పంపుసెట్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడకు ఉరి బిగించడమేనని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో మీడియాతో మాట్లాడిన ఆయన...సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. జగన్ను రైతులు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని స్వాగతించిన జగన్... ముఖ్యమంత్రి అయ్యాక మూడు ముక్కలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది మాట తప్పడం కాదా అని నిలదీశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ముఖ్యమంత్రిగా జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న జగన్... ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు.
'తండ్రి మేలు చేస్తే... తనయుడు కీడు చేస్తున్నాడు' - Tulasireddy Latest news
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు మేలు చేస్తే... ఆయన తనయుడు సీఎం అయ్యాక అన్నదాతలను ఆగం చేస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి