ఈడబ్ల్యూఎస్ చేయూత పథకం బాగుంది... కానీ 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సంగతేంటి? అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు. అగ్రవర్ణ పేదల మీద జగన్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత వివక్ష అని నిలదీశారు. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈడబ్ల్యూఎస్ చేయూత సరే... పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సంగతేంటి?
అగ్రవర్ణాలలోని పేద మహిళలకు ఈడబ్ల్యూఎస్ చేయూత పథకం కింద ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. కానీ పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సంగతేంటి? అని తులసి రెడ్డి ప్రశ్నించారు.
అగ్రవర్ణాల్లోని పేదలకు ఈడబ్ల్యూఎస్ కింద కేంద్రం... విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చట్టం చేసిందన్నారు. 2019 ఫిబ్రవరి 1వ తేదీనుంచి ఈ చట్టం అమలులోకి వచ్చిందన్నారు. కేంద్రం రెండు సంవత్సరాలుగా విద్యా సంస్థల్లో, ఉద్యోగాలలో అమలు చేస్తున్న.. రాష్ట్రంలో అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 18 నెలల కాలంలో గ్రామ వార్డు వాలంటీర్ల ఉద్యోగాలకు సంబంధించి 26,807 ఉద్యోగాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో 12,859 ఉద్యోగాలు, వైద్య, ఆరోగ్యశాఖలో 971 ఉద్యోగాలు కోల్పోయారని అగ్రవర్ణాలకు చెందిన పేదలు కోల్పోయారని అన్నారు.
ఇదీ చదవండి