కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేస్తోందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసీరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో మాట్లాడిన ఆయన.. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని కేంద్ర మంత్రులు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇప్పుడు మాత్రం పుదుచ్చేరికి హోదా ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రకటనకు నిరసనగా.. రాష్ట్ర భాజపా నాయకులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో ఆ పార్టీకి జనసేన మద్దతు ఉపసంహరించుకోవాలని పవన్ కల్యాణ్‌ను కోరారు.