Congress Leader Tulasi Reddy Press Meet On Kadapa Steel Plant : "అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని" అన్న చందంగా కడప ఉక్కు కర్మాగారం పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సంస్థ చైర్మన్ తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్ జిల్లాలో కడప ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు అన్ని రకాల వసతులు ఉన్నాయి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం చిత్తశుద్ధి లేకపోవడం వలనే ఉక్కు కర్మాగారం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Congress Public Meeting on September 6th for Kadapa Steel Plant Issue in Kadapa :వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు కృషి చేస్తామని, ఈ నెల ఆరో తేదీన కడపలో "కడప ఉక్కు ఆంధ్రుల హక్కు" అనే నినాదంతో పీసీసీ సభ్యులు పల్లంరాజు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రుద్రమరాజు తదితర రాష్ట్ర నాయకులచే పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తులసి రెడ్డి తెలిపారు. కడపలో పార్టీ కార్యాలయంలోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Dharna For Kadapa Steel Plant: కడప ఉక్కు కర్మాగారం కోసం అఖిలపక్ష నేతల ధర్నా
Tulasi Reddy Fire on YSRCP Government :విభజన చట్టంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాయలసీమలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని హామీ ఇచ్చారని తులసి రెడ్డి గుర్తు చేశారు. కానీ ఆ హామీని అమలు పరచడంలో ఇప్పుడున్న బీజేపీ సర్కార్, వైసీపీ సర్కార్లు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మాట మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై మొదటి సంతకం పెడతారని ఆయన హామీ ఇచ్చారు.