ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక పెట్రోలు, డీజిల్‌పై భారీగా ఎక్సైజ్ సుంకం పెంచారని.. రాష్ట్ర కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. పెట్రో ధరలు తగ్గించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. పార్టీ అధిష్ఠానం సూచన మేరకు కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ద్వారా లేఖ పంపినట్లు తులసిరెడ్డి వెల్లడించారు.
పెట్రో ధరలు తగ్గించాలని కోరుతూ రాష్ట్రపతికి తులసిరెడ్డి లేఖ - పెట్రో ధరలపై తులసిరెడ్డి వ్యాఖ్యల వార్తలు
దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని.. రాష్ట్ర కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి విజ్ఞప్తి లేఖ రాశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రో ధరలు తగ్గడం లేదన్నారు.
తులసిరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నేత
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా.. దేశంలో పెట్రో ధరలు తగ్గడం లేదని తులసిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ ధరల ప్రకారం పెట్రోలు, డీజిల్ విక్రయిస్తే ధరలు తగ్గుతాయని సూచించారు. ఎక్సైజ్ సుంకం పేరుతో కోట్ల రూపాయలను వసూలు చేసి కేంద్రం తమ ఖజానా నింపుకుంటోందని ఆరోపించారు. వెంటనే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి... : టిక్‌టాక్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు... తరువాత?