ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని రైతులకు శనగ విత్తనాలు పంపిణీ చేయలేని దుస్థితి ఉందని... ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా.. రైతు నిరాశగా మారిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా ఒక్కో రైతుకు 12,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలు ఆపాలని, రుణ మాఫీ చేయాలని కోరారు.
'రైతు భరోసా పథకం.. రైతు నిరాశగా మారింది' - jagan govt
ఎన్నికల సమయంలో రైతులకు వరాలు ప్రకటించి.. గెలిచిన తర్వాత రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు.
congress leader tulasi reddy fires on jagan govt