జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులు నిమిత్తమాత్రులని, కేవలం ఉత్సవ విగ్రహాలతో సమానమని.. అటువంటి వారు ఉన్నా ఒకటే లేకున్నాఒకటేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసీరెడ్డి (Congress leader Tulasi Reddy) విమర్శించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ మూల కారణం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ఆరోపించారు. త్వరలో రాష్ట్ర క్యాబినెట్లో మార్పులు జరుగుతాయని వార్తలొస్తున్నాయని అన్నారు. మంత్రులను మార్చితే ఎలాంటి మార్పు ఉండదని... సీఎంను మార్చాలని వ్యాఖ్యానించారు.
మార్చాల్సింది మంత్రులను కాదు.. ముఖ్యమంత్రినే: తులసి రెడ్డి - సీఎం జగన్పై తులసి రెడ్డి విమర్శలు
సీఎం జగన్(cm jagan)పై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి (Congress leader Tulasi Reddy)విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే మూలం అని ఆరోపించారు. త్వరలో రాష్ట్ర క్యాబినెట్లో మార్పులు జరుగుతాయని వార్తలొస్తున్నాయని... మార్చాల్సింది మంత్రులను కాదని... ముఖ్యమంత్రినే అని వ్యాఖ్యానించారు.
తులసి రెడ్డి