ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TULASI REDDY: పెంచిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా సైకిల్ యాత్ర - cycle yarea

రోజు రోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలను ప్రభుత్వాలు కట్టడి చేయాలని కోరుతూ కాంగ్రెస్​ నేత తులసి రెడ్డి సైకిల్​ యాత్ర చేపట్టారు. సంతకాల సేకరణ నిర్వహించి.. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ లను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కోరారు.

TULASI REDDY
పెంచిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా సైకిల్ యాత్ర

By

Published : Jul 7, 2021, 6:10 PM IST

పెట్రో, వంటగ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ కడప జిల్లా మైదుకూరులో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు.

ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాలు జలగల్లా ప్రజల రక్తం పీల్చేస్తున్నాయని విమర్శించారు. పెట్రో, డీజిల్ పై పెంచిన ఎక్సైజ్ సుంకం, అదనపు వ్యాట్, రోడ్డు సెస్సులను ఉపసంహరించాలని డిమాండ్​ చేశారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ లను తక్షణమే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details