సీఎం జగన్‌కు తెలుగు భాష మీద అంత ద్వేషం ఎందుకని.. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు. ఆంగ్ల భాష మీద అంత మోజు ఉంటే తన సాక్షి పేపర్‌ను తీసేసి.. ఇంగ్లీష్ పేపర్‌ను పెట్టాలన్నారు. తెలుగుదనానికి నిర్వచనంలా కనిపించే వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఫొటోను వైకాపా జెండాలోంచి తీసేయాలని డిమాండ్ చేశారు.
'సాక్షి పత్రిక తీసేసి.. ఇంగ్లీష్ పేపర్ పెట్టుకో'
ముఖ్యమంత్రి జగన్‌కు ఆంగ్ల భాష మీద అంత మమకారం ఉంటే సాక్షి పత్రికను తీసేసి ఇంగ్లీష్ పేపరును నడిపించాలని... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సూచించారు. పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం చారిత్రక తప్పిదమని అభిప్రాయపడ్డారు.
తులసిరెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్
బోగస్ సర్వేలు చేసి 96 శాతం తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పారని చెప్పడం మూర్ఖత్వమన్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం పెద్ద తప్పిదమవుతుందని పేర్కొన్నారు. తెదేపా, వైకాపాలు బీసీలను ఉద్ధరించినట్లుగా మాట్లాడుతున్నారని.. వారందరికంటే ముందే 1970లో కాసు బ్రహ్మానందరెడ్డి బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తుచేశారు.
ఇవీ చదవండి... 'ప్రశ్నిస్తే కేసులు.. ఎదిరిస్తే దాడులు.. ఇదే ప్రభుత్వ పాలన'