పోలవరం ప్రాజెక్టు అంశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంపై రణమా?... శరణమా? లేదంటే రాజీనామానా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం కడపలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
'పోలవరం విషయంలో రణమా?... శరణమా?' - కడప జిల్లా తాజా వార్తలు
పోలవరం విషయంలో కేంద్రంతో రణ నినాదాన్ని ఎంచుకుంటారా? లేదంటే శరణమంటారా? అని ముఖ్యమంత్రి జగన్ను కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రం నిధులతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భాజపాతో పోరాటం చేయడానికి జగన్ మోహన్ రెడ్డి రణం నినాదాన్ని ఎంచుకుంటారా? లేదంటే కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పనిచేస్తూ శరణం అంటారో తేల్చుకోవాలి. ఇవేవీ కాకుండా అనుభవం లేకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేస్తారా?... పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయి
- తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు