ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తిరుపతి ఉప ఎన్నికకు అడ్డం రాని కరోనా.. పంచాయతీ ఎన్నికలకు ఎలా ?' - ఏపీలో పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్ వ్యాఖ్యలు

ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీకి సిద్ధమవుతూ.. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా లేమని అంటోందని అన్నారు. కరోనా గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే ఎలా అడ్డువచ్చిందని ప్రశ్నించారు.

congress leader tulasi reddy
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి

By

Published : Jan 9, 2021, 5:21 PM IST

ఓ వైపు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీకి సిద్ధమవుతూ.. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా లేమంటూ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి దుయ్యబట్టారు. కరోనా, వ్యాక్సినేషన్ కారణాలతో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సిద్ధంగా లేమని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు లేఖ రాయలేదని ఆయన ప్రశ్నించారు.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు అడ్డం రాని కరోనా, గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రం ఎలా వచ్చిందని నిలదీశారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఉందని తులసి రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఎన్నికల ప్రవర్తనా నియమావళి గ్రామాలకే: ఎస్​ఈసీ

ABOUT THE AUTHOR

...view details