ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్టిక్కర్ల ప్రభుత్వాన్ని స్టిక్కుతో కొట్టే సమయం వచ్చింది.. తులసిరెడ్డి విమర్శలు - స్టిక్కర్ పార్టీని త్వరలోనే ప్రజలు స్టిక్కుతో

MAA NAMMAKAM NUVVE JAGAN: 'మా నమ్మకం నువ్వే జగన్' స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అతికించాలని జగన్ నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి అన్నారు. సొంత కుటుంబ సభ్యులే జగన్‌ని నమ్మే స్థితిలో లేనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారని ఎద్దేవా చేశారు. స్టిక్కర్ పార్టీని త్వరలోనే ప్రజలు స్టిక్కుతో కొడతారని వ్యాఖ్యానించారు.

Tulsi Reddy Congress
Tulsi Reddy Congress

By

Published : Feb 12, 2023, 7:42 PM IST

Updated : Feb 12, 2023, 10:30 PM IST

MAA NAMMAKAM NUVVE JAGAN: 2024 ఎన్నికల్లో మరలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి ఇళ్లకు 'మా నమ్మకం నువ్వే జగన్' అనే ట్యాగ్​తో కూడిన స్టిక్కర్​ను అతికించనున్నారు. ఈ కార్యక్రమంపై పలు రాజకీయ నాయకులు జగన్​పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మీడియా ఛైర్మన్‌ తులసి రెడ్డి ఘాటుగా స్పందించారు.

జగన్ స్టిక్కర్ పార్టీకి స్టిక్​తో సమాధానం: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని తన కుటుంబ సభ్యులే నమ్మడం లేదని కాంగ్రెస్ పార్టీ మీడియా ఛైర్మన్‌ తులసి రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లి లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి మాట్లాడుతూ మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ ను ప్రతి ఇంటికీ అతికించాలని జగన్ నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే స్టిక్కర్ లు అతికించాలని నిర్ణయంచారని అన్నారు. అసలు జగన్ ను ఎందుకు నమ్మాలి అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా, అవినీతి, అరాచక, ఆంధ్ర ప్రదేశ్ గా మార్చినందుకా , లేక మద్యం, జూదం ఆంధ్ర ప్రదేశ్ గా మార్చినందుకా అని ప్రశ్నించారు. రైతులను ,మహిళలను, ఉద్యోగులను, నిరుద్యోగులను, విద్యార్థులను, సర్పంచులను, కాంట్రాక్టర్లను నమ్మించి మోసగించి నందుకా అని అన్నారు. కనీసం నీ కుటుంబ సభ్యులే నిన్ను నమ్మడం లేదు. ఇతరులు ఎలా నమ్ముతారు అని ధ్వజమెత్తారు. జగన్ స్టిక్కర్ పార్టీని ప్రజలు స్టిక్ తో తరిమి తరిమి కొడతారని తులసి రెడ్డి జోస్యం చెప్పారు.

జగన్​మోహన్ రెడ్డికి ఓటమి ఫోబియా పట్టుకుంది. మా నమ్మకం నువ్వే జగన్ అంటా దేనికి నమ్మాలి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా చేసినందుకా అవినీతి, అరాచక, ఆంధ్ర ప్రదేశ్ గా మార్చినందుకా , లేక మద్యం, జూదం ఆంధ్ర ప్రదేశ్ గా చేసినందుకు నమ్మాలనా. జగన్ స్టిక్కర్ పార్టీని ప్రజలు స్టిక్ తో తరిమి తరిమి కొడతారు. - తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మీడియా ఛైర్మన్‌

స్టిక్కర్ పార్టీని త్వరలోనే ప్రజలు స్టిక్కుతో కొడతారు:తులసిరెడ్డి

ఇవీ చదవండి

Last Updated : Feb 12, 2023, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details