ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కడప జిల్లాకు ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నారు' - thulasireddy commentst on cm news

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు అన్యాయం చేస్తున్నారని.. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసీరెడ్డి ధ్వజమెత్తారు. ప్రకాశం, నల్గొండ ముంపు బాధితులకు పరిహాం ఇచ్చిన విధంగానే గండికోట రిజర్వాయర్ ముంపు బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

thulasireddy
తులసీరెడ్డి

By

Published : Sep 1, 2020, 1:06 PM IST

కడప జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడపకు అన్యాయం చేయటం బాధాకరమని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి అన్నారు. గండికోట రిజర్వాయర్, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో బాధితులకు సీఎం అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం, నల్గొండ ముంపు బాధితులకు వన్​టైమ్ సెటిల్​మెంట్ కింద ఇస్తున్నట్లే.. గండికోట, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ బాధితులకు 12.30 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details