ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'తెలుగు కోసం సీపీ బ్రౌన్ చేసిన కృషిని సీఎం గుర్తు చేసుకోవాలి'

సీపీ బ్రౌన్​ 221 జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి నివాళి అర్పించారు. కడప జిల్లాలో నివసించిన బ్రౌన్​ తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారని.. అలాంటిది కడప జిల్లాలో పుట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు తెలుగు లేకుండా జీవో జారీ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

By

Published : Nov 10, 2019, 9:07 PM IST

Published : Nov 10, 2019, 9:07 PM IST

congress leader thulasi reddy press meet on telugu language in kadapa district

తెలుగు కోసం సీపీ బ్రౌన్ చేసిన కృషిని సీఎం గుర్తు చేసుకోవాలి

కడప జిల్లా వేంపల్లెలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి సీపీ బ్రౌన్​ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి నివాళి అర్పించారు. కడప జిల్లాకు సీపీ బ్రౌన్​కు ప్రత్యేక అనుబంధం ఉందని తులసీరెడ్డి అన్నారు. తెలుగు భాష కోసం ఆయన ఎంతో కృషి చేశారని... లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్​గా పని చేశారని గుర్తు చేశారు. కడప జిల్లాలో నివసించిన బ్రౌన్​కు తెలుగు పట్ల అంత ఇష్టముంటే ఇదే జిల్లాలో పుట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... నాడు తెలుగు లేకుండా జీవో జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగు లెస్ చేశారని ఆరోపించారు. వెంటనే జీవో 81 రద్దు చెయ్యాలని కోరారు. ఆంధ్రప్రదేశ్​లో ఉన్న డ్వాక్రా పథకం దేశానికే ఆదర్శమని... అలాంటి పథకంలో కీలకంగా ఉన్న 28 వేల మంది డ్వాక్రా యానిమేటర్లను ఒక్క జీవోతో రోడ్డున పడేశారంటూ ధ్వజమెత్తారు. వెంటనే ఈ జీవోను రద్దు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు మిలాద్​ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details