కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి కడపలో ఎడ్లబండ్లపై తిరుగుతూ... నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గినా... పెట్రోల్ ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరుగుబాటు చేయకముందే ప్రభుత్వాలు మేల్కోవాలని హితవుపలికారు.
ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారు: తులసిరెడ్డి - కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వార్తలు
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి... కడపలో ఎడ్లబండ్లపై తిరుగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
పెట్రోల్ ధరలు పెంచుతున్నారని వినూత్న రీతిలో నిరసన తెలిపిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి