ఇరవై రెండు నెలల వైకాపా పాలనను చూసి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన... సీఎం జగన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉంది : తులసిరెడ్డి - thirupathi latest news
ఓటర్లకు ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాయడంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఖల్లో రాష్ట్రం చేసిన అప్పులు, పెరిగిన ధరల వివరాలను వెల్లడించి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
ఇరవై రెండు నెలల కాలంలో రాష్ట్రం చేసిన అప్పు వివరాలు, పెరిగిన ధరల వివరాలను లేఖలో రాసి ఉంటే బాగుండేదని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న వైకాపా నేతల హామీతో గత ఎన్నికల్లో 22 మంది వైకాపా ఎంపీలను గెలిపించారని అన్నారు.
ఇదీచదవండి.