ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాంగ్రెస్ భరోసా యాత్ర - comments

వైకాపా, భాజపా కలయిక బహిరంగ రహస్యమేనని కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా పైనే అని స్పష్టం చేశారు.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

By

Published : Feb 16, 2019, 2:13 PM IST

Updated : Feb 16, 2019, 2:24 PM IST

ప్రతిపక్షనేత జగన్, ప్రధానమంత్రి మోదీ జట్టు కట్టారని కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. ఆయన పదవి నుంచి దిగిపోయే సమయంలో వైకాపా, భాజపాతో కలుస్తోందని ఎద్దేవా చేశారు. వారి కలయిక బహిరంగ రహస్యమేనన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. విభజన హామీలు నెరవేర్చకుండా.. మోసం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. మొదటి సంతకం ప్రత్యేక హోదా పైనే అని స్పష్టం చేశారు. ఈనెల 19 నుంచి రాష్ట్రంలో భరోసా యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

ఇవి కూడా చదవండి...

Last Updated : Feb 16, 2019, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details