భారతదేశంలో ముస్లింలను లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను ప్రవేశపెట్టిందన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... సుప్రీంకోర్టులో ఈ చట్టం నిలబడదనిఆశాభావం వ్యక్తం చేశారు. చట్టాలు రద్దు చేసేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని తులసిరెడ్డి స్పష్టం చేశారు.
'ఆ చట్టం సుప్రీం కోర్టు కొట్టేస్తుంది' - కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తోందన్న మాజీ రాజ్యసభ సభ్యుడు
సిఏఏ, ఎన్ఆర్సి చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే ఉండదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడప కళాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.
!['ఆ చట్టం సుప్రీం కోర్టు కొట్టేస్తుంది' congress conduct meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5608705-751-5608705-1578281984903.jpg)
ముస్లింలు ఉండకూడదనే "కేంద్రం" ఈ చట్టాలు తెచ్చింది
ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతున్న తులసిరెడ్డి
ఇవీ చూడండి...