కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా.. వైకాపా వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక ఐదో వార్డులో ఓటు వేసేందుకు వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్త.. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేముందు తన మొబైల్‌ను వైకాపా అభ్యర్థికి ఇచ్చారు. ఓటు వేశాక మొబైల్‌ను అంగన్‌వాడీ కార్యకర్త తీసుకున్నారు. తర్వాత కొంత సమయానికి మొబైల్‌లో సిమ్‌కార్డులు లేనట్టు గుర్తించి.. వైకాపా అభ్యర్థి మురళీధర్‌రెడ్డిని నిలదీశారు. ఆ క్రమంలోనే పోలీసులు వచ్చి సిమ్‌కార్డులు ఇప్పిస్తామని చెప్పి సర్దిచెప్పారు. అప్పుడే తెదేపా అభ్యర్థి ప్రసాద్ వర్గీయులు రావడంతో వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
ప్రొద్దుటూరులో తెదేపా, వైకాపా వర్గాల మధ్య వాగ్వాదం - prodhuturu municipal elections updates
కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా వైకాపా వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అంగన్‌వాడీ కార్యకర్త ఫోన్లో సిమ్‌ను వైకాపా అభ్యర్థి మాయం చేశారని ఆరోపించారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

ప్రొద్దుటూరులో తెదేపా, వైకాపా వర్గాల మధ్య వాగ్వాదం
ప్రొద్దుటూరులో తెదేపా, వైకాపా వర్గాల మధ్య వాగ్వాదం
ఇదీ చదవండి:ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్