ఉపాధి హామీ పనులపై వివాదం... ఐదుగురిపై కేసు నమోదు - రేగడిపల్లిలో ఉపాధి హామి పనుల వివాదం
ఉపాధి హామీ పనులు జరిపించాలని ఒక వర్గం.... గ్రామం మునకకు గురవుతుంటే ఇప్పుడు ఎందుకని మరో వర్గం పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన కడప జిల్లా కొండాపురం మండలం రేగడిపల్లి గ్రామంలో జరిగింది. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులకు వెల్లడించారు.
ఉపాధి హామీ పనులు జరిపించాలని ఒక వర్గం.... గ్రామం మునకకు గురవుతుంటే ఇప్పుడు ఎందుకని మరో వర్గం పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటన కడప జిల్లా కొండాపురం మండలం రేగడిపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు కొండాపురం మండలంలోని రేగడిపల్లి గ్రామం గండికోట జలాశయం కింద ప్రాంతాలు మునకకు గురవుతున్నాయి. వర్షాకాలంలో జలాశయానికి నీరువస్తే సుమారు 14 గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈక్రమంలో ఉపాధి హామీ పనులు నిర్వహించాలని రేగడిపల్లిలోని వైకాపాకు చెందిన ఒక వర్గం వారు కోరగా... ఆ పార్టీకి చెందిన మరో వర్గం వారు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి వివాదం నెలకొంది. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు కొండాపురం పోలీసులు తెలిపారు.