ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గండికోటలో ఇరు వర్గాల ఘర్షణ.. ఇద్దరికి స్వల్ప గాయాలు - గండికోటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వార్తలు

జమ్మలమడుగు సమీపంలోని గండికోట ముఖ ద్వారం వద్ద మద్యం తాగి.. అన్నం తినేటపుడు ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

Conflict between the two factions
గండికోటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

By

Published : Jan 25, 2021, 3:46 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని గండికోట ముఖ ద్వారం వద్ద అన్నం తినేటపుడు ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి జమ్మలమడుగు మండలానికి చెందిన కొంతమంది యువకులు ముఖ ద్వారం వద్ద మద్యం తాగి.. అన్నం తినేటపుడు ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య జరిగిన దాడిలో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

ఒక వర్గం మరో వర్గానికి చెందిన ద్విచక్రవాహనాన్ని దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుని విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

పల్లెపోరు... సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ

ABOUT THE AUTHOR

...view details