షోకాజ్ నోటీసులు పంపించారని ఓ కండక్టర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కడప జిల్లా జమ్మలమడుగులో చోటు చేసుకుంది. జమ్మలమడుగు డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా సురేష్ బాబు పని చేస్తున్నాడు. గత నెల 8వ తేదీన మద్యం తాగి విధులు నిర్వర్తిస్తుండగా స్క్వాడ్ అధికారుల తనిఖీల్లో దొరికాడు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అధికారులు సురేష్‌ను తాత్కాలికంగా విధుల నుంచి పక్కన పెట్టారు. ఈ నెల 3వ తేదీన సురేష్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్లు షోకాజ్ నోటీసులు పంపారు. శుక్రవారం నోటీసులు విషయం తెలిశాక డిపో గ్యారేజీ వద్ద పెట్రోల్ పోసుకుని.. నిప్పు అంటించుకోబోయాడు. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది అతన్ని వారించి పోలీసులకు అప్పగించారు.
విధుల నుంచి తొలగించారని కండక్టర్ ఆత్మహత్యాయత్నం - kadapa district latest updates
విధుల నుంచి తప్పిస్తున్నట్లు షోకాజ్ నోటీసులు అందుకున్న కండక్టర్ డిపో వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సురేష్‌ను గమనించిన ఆర్టీసీ సిబ్బంది అతన్ని నిలువరించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కడప జిల్లా జమ్మలమడుగులో జరిగింది.
షోకాజ్ ఇచ్చిందుకు కండక్టర్ ఆత్మహత్యాయత్నం
ఇదీ చదవండి :
ట్రాక్టర్ కింద తలపెట్టి వ్యక్తి ఆత్మహత్య