ఈ కండక్టర్ నిజాయతీపరుడు... ఎందుకో తెలుసా..? - ఆర్టీసీ కండక్టర్ నిజాయతి వార్తలు
కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న రామచంద్రయ్య నిజాయతీని చాటుకున్నాడు. ప్రయాణికులు బస్సులో మర్చిపోయిన వస్తువులను బాధ్యతతో అధికారులకు అప్పగించాడు.
కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న రామచంద్రయ్య తన నిజాయతీని చాటుకున్నాడు. రాజంపేట నుంచి రాయచోటికి వెళ్తున్న బస్సులో ఓ యువకుడు తన బ్యాగ్‌ను మరిచిపోయి మధ్యలోనే దిగాడు. గమనించిన కండక్టర్ బ్యాగును డిపో మేనేజర్ బాలాజీకి అందజేశారు. గతంలో కూడా బద్వేలు డిపోలో విధులు నిర్వహిస్తున్న సమయంలో బంగారు గాజులు దొరకగా ఆర్టీసీ అధికారులకు అందజేసినట్లు డీఎం తెలిపారు. ఆర్టీసీలో ప్రతి కండక్టర్ నిజాయతీగా వ్యవహరిస్తూ ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి బాధితులకు అందించాలని సూచించారు.