ఎస్సై ఉద్యోగానికి ఎంపికైన కండక్టర్ కూతురు - job
ఒకే మండలానికి చెందిన ఇద్దరు ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. కష్టపడితే విజయం సాధించవచ్చని నిరూపించారు.
పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు కడప జిల్లాకు చెందిన యువతీ, యువకుడు. ఒకరు సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ కాగా.. మరొక విద్యార్థి ఆర్ఎస్ఐగా ఎంపికయ్యారు. జిల్లాలోని పోరుమామిళ్లకు చెందిన పి.కల్పన రెండు రోజుల క్రితం ప్రకటించిన ఫలితాల్లో ఆర్ఎస్ఐగా ఎంపికైంది. ఈమె ఎమ్మెస్సీ చదివి గ్రూప్2 కోసం హైదరాబాద్లో శిక్షణ తీసుకుంటోంది. టైక్వాండోలో క్రీడాకారిణిగా ఐదు సార్లు జాతీయ స్థాయి పథకాలు సాధించింది. కల్పన తండ్రి తిరుపతయ్య ఆర్టీసీ కండక్టర్‌గా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పని చేస్తున్నారు. పోరుమామిళ్ల మండలం టేకూరుపేటకు చెందిన లక్ష్మణరావు ఎస్ఐగా సెలక్ట్ అయ్యారు. 2011లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించిన ఇతను.. ప్రస్తుతం కడపలో పని చేస్తున్నారు. ఇప్పుడు ఎస్సైగా ఎంపికయ్యారు.