కడప జిల్లా కమలాపురం మండలంలోని నసంతపురం, చిన్నరెడ్డిపల్లి, నడింపల్లి గ్రామాల్లో రోజూ సుమారు 80 వరకు ఇసుక టిప్పర్లు, లారీలు తిరుగుతున్నాయి. ఈ వాహనాల రద్దీతో రోడ్డు పూర్తిగా పాడైపోతోందని.. దుమ్ము, ధూళి ఇళ్లల్లోకి చేరి అనారోగ్యం బారిన పడుతున్నారని గ్రామస్థులు చెప్పారు. నెమ్మదిగా వెళ్లాలని చెప్పినా వాహనదారులు పట్టించుకోవట్లేదన్నారు.
ఈ సమస్యపై.. స్థానికులు, చుట్టు పక్కల గ్రామస్థులు.. వాహనాలను ఆపి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు చెప్పినా.. వాహనాదారులు స్పందించకుండా వెళ్తున్నారని ఆందోళన చెందారు. రోడ్డు పాడైపోతోందన్నారు. లారీల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ఇసుక క్వారీ వద్దకు వెళ్లాల్సిన లారీలు వెను దిరిగి వెళ్లిపోయాయి.