ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బద్వేల్​లో తెదేపా కౌన్సిలర్​ అభ్యర్థి అదృశ్యం.. పార్టీ నేతల ఫిర్యాదు - missing of TDP councilor candidate news

కడప జిల్లా బద్వేల్​లో తెదేపా కౌన్సిలర్​ అభ్యర్థి కనిపించడం లేదని ఆ పార్టీ నేతలు పట్టణ సీఐకి ఫిర్యాదు చేశారు. వైకాపా నాయకులు బెదిరించి.. అతన్ని కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానించారు.

Complaint over the disappearance of TDP councilor candidate
తెదేపా కౌన్సిలర్​ అభ్యర్థి అదృశ్యంపై ఫిర్యాదు

By

Published : Feb 27, 2021, 10:11 AM IST

కడప జిల్లా బద్వేల్ పురపాలక 29వ వార్డు తెదేపా కౌన్సిలర్ అభ్యర్థి ఈశ్వరయ్య వారం రోజులుగా కనిపించటం లేదు. ఈ విషయంపై.. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, బద్వేల్ పురపాలక ఎన్నికల పరిశీలకులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి.. పట్టణ సీఐ రమేశ్​కు ఫిర్యాదు చేశారు.

ఆయన జాడ గురించి వారం రోజులుగా కుటుంబ సభ్యులకు సమాచారం లేదన్నారు. వైకాపా నేతలే బెదిరించి అపహరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందే అతని ఆచూకీ తెలుసుకుని.. కుటుంబీకులకు సురక్షితంగా అప్పజెప్పాలని కోరారు. ఈ విషయంపై... ఎస్​ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details