ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హామీలు, వాగ్దానాలపై పోటీ పడండి.. - కడప జిల్లాలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య మాటల యుద్దం

నగర పంచాయతీ ఫలితాలపై.. కడప జిల్లాలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దీనిపై ఇరువురు నేతలు స్పందించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అంత మాత్రాన గెలిచిన వారు ఓడిన వారిపై వ్యక్తిగతంగా కించపరిచే విధంగా విమర్శలు చేయడం తగదన్నారు.

Compete on guarantees and promises says kadapa mla sudheer reddy and ex minister adi narayana reddy
హామీలు, వాగ్దానాలపై పోటీ పడండి

By

Published : Mar 17, 2021, 12:38 PM IST

నగర పంచాయతీ ఫలితాలపై కడప ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి రెండు రోజులుగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. దీనిపై ఇరువురు స్పందించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అంత మాత్రాన గెలిచిన వారు ఓడిన వారిపై వ్యక్తిగతంగా కించపరిచే విధంగా విమర్శలు చేయడం తగదన్నారు. అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాగ్దానాలను పోటీపడి నెరవేర్చాలే తప్ప కుటుంబాలు, కుటుంబ సభ్యుల పేర్లతో ధూషించడం తగదన్నారు. ఇటీవల ఎన్నికలన్నీ ప్రశాంతంగా జరిగాయని.. ఇలాంటి పరిస్థితుల్లో నాయకులు మాట్లాడుతున్న భాష జిల్లాకే చెడ్డపేరు వచ్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details