కడప జిల్లాలో నివర్ తుపాను ప్రభావంపై కలెక్టరేట్లో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా, వైకాపా ఎమ్మెల్యేలు, తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. జిల్లాలో శనగ పంటకు వందశాతం నష్టం జరిగిందని వైకాపా ఎమ్మెల్యేలు, తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి సమీక్షలో ప్రస్తావించారు. పులివెందుల నియోజకవర్గంలో శనగ పూర్తిగా నాశనమైందని..,హెక్టారుకు లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. బత్తాయి, బొప్పాయి, అరటి పంటలు దెబ్బతిన్నాయన్నారు. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులు అధికారులు నిర్లక్ష్యం వల్ల కోతకు గురయ్యాయని సభ్యులు ప్రస్తావించారు. బుగ్గవంక బాధితులకు తక్షణం 25 వేల ఆర్థికసాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టు ఆధునీకరణకు త్వరలో టెండర్లు
నివర్ తుపాను ప్రభావంతో అన్ని మండలాల్లో లక్షా 42 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని..,వారం లోపు పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని మంత్రి సురేశ్ అధికారులను ఆదేశించారు. 33 శాతం పంట దెబ్బతింటేనే పరిహారం ఇస్తారనే నిబంధన పక్కనపెట్టి...ఉదారంగా అంచనా వేసి రైతులకు మేలు చేయాలన్నారు. పింఛ, అన్నమయ్య, బుగ్గవంక ఆధునీకరణకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని అన్నారు. బుగ్గవంక ప్రవాహంతో నిరాశ్రయులైన 20 వేల మందికి రూ. 500 తక్షణ సాయం అందించామన్నారు. పింఛ ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కులు పైగానే ప్రవాహం రావడంతోనే కట్ట కోతకు గురైందన్నారు.
బుగ్గవంకకు రక్షణ గోడ