కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేసి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. కడప జిల్లా జమ్మలమడుగులో ప్రజా సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. బ్లాక్ డే సందర్భంగా బుధవారం జమ్మలమడుగులోని ఆటో స్టాండ్లో సీపీఎం, సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు నిరసన తెలియజేశారు.
కార్పొరేట్ కంపెనీలకు లాభాన్ని తెచ్చే నూతన వ్యవసాయ చట్టాలను.. వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు కరోనా బారిన పడి అల్లాడిపోతుంటే.. ప్రధాని మోదీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.