అక్టోబర్ నెలాఖరులోపు తాళ్ల పొద్దుటూరు వారందరికీ జోగాపురంలో పునరావాస కల్పనకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. గండికోట ప్రాజెక్టు ముంపు ప్రాంతం తాళ్లపొద్దుటూరు వారికి పునరావాస కల్పనలో భాగంగా సుగమంచి పల్లి రైతులతో కలెక్టర్ చర్చించారు. ఇప్పటికే 101 ఎకరాలను రైతుల నుంచి సేకరించామని, ఈ భూమిని అభివృద్ధి చేయడానికి, రోడ్లు వేయడానికి టెండర్లు పిలిచామని వివరించారు. పునరావాస కాలనీలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించి తగు సూచనలు ఇచ్చారు.
'జోగాపురంలో పునరావాస కల్పనకు చర్యలు చేపట్టాలి' - కడప జిల్లా
గండికోట ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు నీటి నిల్వ ఉంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని వివరించారు.
గండికోట ప్రాజెక్ట్ పై కలెక్టర్ సమీక్ష