ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూగర్భ జలాల అంచనాలను తయారు చేయాలని ఆదేశం - కడప జిల్లా ప్రధాన వార్తలు

కడప జిల్లా భూగర్భ జలాల అంచనాలను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సీ.హరికిరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో సమావేశం నిర్వహించారు.

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్

By

Published : Dec 4, 2020, 2:26 AM IST

కడప జిల్లా కలెక్టర్ సీ.హరికిరణ్ భూగర్భ జలాల అంచనాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 2004లో భూగర్భ జల వనరుల అంచనా కొరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్​ఆండ్​డీ సలహా మేరకు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

జిల్లాలోని వివిధ శాఖలు వినియోగించుకుంటున్న భూగర్భ జలాలు, రీఛార్జ్ వివరాలు, చెరువులు, రిజర్వాయర్ల ప్రవాహలను లెక్కించి అంచనాలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జలవనరులు, ప్రజారోగ్య, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం, భూగర్భ జల శాఖ అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తుది నివేదికను డిసెంబర్ 15 లోగా సమర్పించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి

కడపలో జోరుగా అక్రమ లే - అవుట్లు.. ఎన్నాళ్లీ అక్రమాలు?

ABOUT THE AUTHOR

...view details