సాధారణంగా టెంకాయ చెట్లు 200 నుంచి 300 కాయల వరకు దిగుబడి వస్తుంది. కోస్తా ప్రాంతంలో అయితే కాసింత ఎక్కువ రావచ్చేమో గాని రాయలసీమ ప్రాంతంలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా 300 కాయలకు మించి వచ్చే పరిస్థితి లేదు. కానీ ఓ ప్రధానోపాధ్యాయుడు ఇంటి పెరట్లో పెరుగుతున్న చెట్టుకి మాత్రం ఏకంగా ఏడు వందలకు పైగా కాయలు కాశాయి.
కడప జిల్లా రాజంపేట పట్టణం బలిజపల్లి ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణ పెనగలూరు మండలం కట్టావారిపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన ఇంటి పెరట్లో రెండు టెంకాయ చెట్లు ఉన్నాయి. అందులో ఒకదానికి పైనుంచి కింది వరకు టెంకాయల గెలలు వచ్చాయి. లెక్క పెట్టడానికి వీలు లేనంతగా గెలలు వచ్చి కాయల వరుసలు అబ్బురపరుస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం ఈ చెట్టును తెచ్చి నాటానని దానికి సేంద్రియ ఎరువులు ఉపయోగించానని యజామాని గోపాలకృష్ణ తెలిపారు. క్రమం తప్పకుండా పెరటి తోటలోని నీటి తడులు అందిస్తూ వచ్చానని ఆయన అన్నారు.
ఔరా ఈ చెట్టు... ఏడు వందలకు పైగా టెంకాయలు! - బలిజపల్లిలో కొబ్బరిచెట్టుకు 700 కాయలు తాజా వార్తలు
కొబ్బరిచెట్టుకు సాధారణంగా 200 నుంచి 300 కాయలు కాస్తాయి కదా! కానీ రాయలసీమలోని ఓ ప్రాంతంలో పెరిగిన కొబ్బరిచెట్టుకు ఏకంగా 700 కాయలు కాశాయి. మీకు ఆ చెట్టును చూడాలనుందా..! ఆ ప్రాంతానికి వెళ్లాలనుందా. అయితే ఇది చదివేయండి.
![ఔరా ఈ చెట్టు... ఏడు వందలకు పైగా టెంకాయలు! coconut plant have seven hundred coconuts at balijapalii](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10370938-25-10370938-1611560486254.jpg)
కొబ్బరిచెట్టుకు 700 కాయలు
కొబ్బరిచెట్టుకు 700 కాయలు
Last Updated : Jan 25, 2021, 5:15 PM IST