కేంద్రం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని తెదేపా ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. తన ఇంట్లో జరిగిన పోలీసుల సోదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు చేశారన్నారు. తన అనుచరుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారని తెలిపారు. మీడియా వచ్చేదాకా ఆగకుండా వెళ్లిపోయారన్నారు. రాష్ట్రంలో తెదేపాకు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేకే కుట్రలు పన్నుతున్నారన్నారు. తెదేపా నేతలను ఎన్నికల ప్రచారంలో ఇబ్బంది పెట్టాలని దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. లోటస్పాండ్లో కూర్చుని జగన్ కుట్రలు పన్నుతున్నారనీ... వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించడానికే ఇలాంటి అరాచకాలు చేస్తున్నారన్నారు. ఎవరెన్ని దాడులు చేసినా భయపడేది లేదని స్పష్టంచేశారు.
కేంద్రం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మ: సీఎం రమేష్
కేంద్రం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని తెదేపా ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. తన ఇంట్లో జరిగిన పోలీసుల సోదాలను ఆయన తప్పుబట్టారు.
కేంద్రం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మ: సీఎం రమేష్