ఈ నెల 7, 8 తేదీల్లో ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను పటిష్టం చేస్తోంది. ఉదయం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో కలెక్టర్ సి. హరికిరణ్ సీఎం పర్యటన, ముందస్తు ఏర్పాట్లుపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన అధికారికంగా ఖరారు కాకపోయినప్పటికీ... ప్రాథమిక సమాచారం ప్రకారం ఈనెల 7న కడప ఎయిర్‌పోర్టుకు వస్తారని... అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకుని రాత్రి బస చేస్తారని సమాచారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ -19 పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని జాగ్రత్తలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సీఎం కడప పర్యటన ఏర్పాట్లపై అధికారుల సమీక్ష - jagan to tour kadapa
ఈనెల 7,8 తేదీల్లో కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పర్యటనకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

cm ys jagan