ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Christmas Celebrations: పులివెందులలో సీఎం జగన్​ క్రిస్మస్​ ప్రార్థనలు - CHRISTMAS CELEBRATIONS

YS Jagan Christmas Celebrations: కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అందరితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

cm-ys-jagan-participated-christmas-celebrations
కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్..

By

Published : Dec 25, 2021, 11:00 AM IST

కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్..

YS Jagan at Pulivendula Church: క్రిస్‌మస్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్వస్థలం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ క్రిస్‌మస్ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి సహా జగన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.

అనంతరం మాట్లాడిన జగన్‌.. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details